గర్ల్‌ఫ్రెండ్‌తో చాట్... ఆరు గంటలు ఆగిన ఫ్లైట్

గర్ల్‌ఫ్రెండ్‌తో చాట్...  ఆరు గంటలు ఆగిన ఫ్లైట్

అమ్మాయి, అబ్బాయి మధ్య సరదగా జరిగిన చాటింగ్.. టేకాఫ్ అవ్వాల్సిన విమానం ఏకంగా ఆరు గంటల పాటు ఆగిపోయేలా చేసింది. 185 మంది ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మంగుళూరు నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఎయిర్ పోర్టుకు వచ్చాడు. ఆ యువతి సైతం మంగుళూరు నుంచి ముంబై వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకుంది. ఇంతలో ఆ అబ్బాయి ఫ్లైట్ కు టైం కావడంతో వెళ్లి విమానంలో కూర్చున్నాడు. ఎయిర్ పోర్టులో ముంబయి ఫ్లైట్ కోసం ఎదురుచూస్తున్న ప్రియురాలితో సరదాగా చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. 

మాటల సందర్భంలో ఆ యువతీ యువకులు సరదాగా విమానాల్లో భద్రత గురించి మాట్లాకున్నారు. ఈ క్రమంలో ‘నువ్వే ఓ బాంబర్‌’ అంటూ ఆ అమ్మాయి.. అబ్బాయికి మెసేజ్‌ చేసింది. ఈ మెసేజ్‌ కాస్త అతని తోటి ప్రయాణికురాలి కంట్లో పడటంతో ఆమె భయపడి వెంటనే ఫ్లైట్ సిబ్బందికి సమాచారం ఇచ్చింది. వారు ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు ఇన్ఫామ్ చేయడంతో ప్రయాణికులను కిందికి దింపి విసృత్త తనిఖీలు చేపట్టారు. 

రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది సదరు అబ్బాయి, అమ్మాయిలను అదుపులోకి తీసుకుని కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. చివరకు అది సరదాగా మాట్లాడుకున్న సంభాషణ అని తేలడంతో వారిని వదిలిపెట్టారు. లవర్స్ చాటింగ్  కారణంగా టేకాఫ్ అవ్వాల్సిన విమానం ఆరు గంటలు ఆలస్యమైంది. మరోవైపు విచారణ కారణంగా అమ్మాయి ముంబయి ఫ్లైట్ కూడా మిస్సైంది.