మే17 తర్వాత ఫ్లైట్లు?

మే17 తర్వాత ఫ్లైట్లు?

న్యూఢిల్లీ: ఇప్పటికే ట్రైన్ సర్వీసులను ప్రారంభిస్తున్న కేంద్రం… ఈ నెల 17 తర్వాత విమాన సర్వీసులను కూడా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17తో మూడో దశ లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో దశల వారీగా డొమెస్టిక్ ఫ్లైట్లను నడిపేందుకు సిద్ధమవుతోంది. బ్యూరో ఆఫ్​సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు సోమవారం ఎయిర్ పోర్టులను సందర్శించినట్లు తెలిసింది. మొదట 25 శాతం కమర్షియల్ ఫ్లైట్లను 2 గంటల కంటే ఎక్కువ దూరమున్న ప్రాంతాలకే నడపాలనే ప్రపోజల్ ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం తప్పనిసరి చేయనున్నట్లు తెలిపాయి.

కస్టమర్లకు బ్యాంక్ లోన్ ఆఫర్స్ ఇవే..