
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలను దారి మళ్లించారు. మొత్తం11 విమానాల్లో విజయవాడకు 6, బెంగళూరుకు 4, తిరుపతికి ఒక విమానాన్ని మళ్లించారు. హైదరాబాద్ నుంచి బయల్దేరాల్సిన మూడు విమానాలను తాత్కాలికంగా రద్దు చేశారు.
అయితే, మళ్లించిన వాటిలో 7 విమానాలు తిరిగి హైదరాబాద్కు చేరుకున్నట్టు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. విమాన సర్వీసుల దారి మళ్లింపుతో ప్రయాణికుల బంధువులు ఆందోళనకు గురయ్యారు. అధికారుల ప్రకటనతో అటు ప్రయాణికులు ఇటు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.