హైదరాబాద్, వెలుగు: వివిధ సెక్టార్లలో మంచి పనితీరు కనబరిచిన మహిళా ఎంటర్‌ప్రెనూర్లకు వచ్చే నెల 7 న బిజినెస్ అవార్డులు ఇస్తామని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్ఓ), యంగ్ ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (వైఎఫ్‌ఎల్‌ఓ) పేర్కొన్నాయి. మొత్తం 10 కేటగిరీల్లో 20 అవార్డ్‌లను ప్రధానం చేయనున్నారు. 5 స్పెషల్ అవార్డ్‌లను కూడా ఇవ్వనున్నారు. ఈ ఈవెంట్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రూరల్ డెవలప్‌మెంట్ మినిస్టర్ సీతక్క పాల్గొననున్నారు. మొత్తం 70 నామినేషన్లు అందుకున్నామని, జ్యూరి ఫైనల్ విన్నర్లను సెలెక్ట్ చేస్తుందని ఎఫ్‌ఎల్‌ఓ పేర్కొంది.
