శ్రీరాం సాగర్ దిగువ ప్రాంతాలకు వరద ముప్పు

శ్రీరాం సాగర్ దిగువ ప్రాంతాలకు వరద ముప్పు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఇన్ ఫ్లో అంతకంతకూ పెరుగుతుండటంతో అధికారులు 34 గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వరద ఉద్ధృతి భారీగా కొనసాగుతుండటంతో మిగిలిన గేట్లను సైతం ఎప్పుడైనా ఎత్తే అవకాశముందని అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చేపల వేటకు, వ్యవసాయ పనులకు వెళ్లొద్దని అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. 

నిజామాబాద్ జిల్లాలోని గమ్మిరియాల, దోంచందా, తడపాకల్, సావెల్, కొడిచెర్ల, చాకిరియాల్, పోచంపాడు గ్రామాలతో పాటు నిర్మల్ జిల్లాలోని చింతల్ చందా, మునిపల్లి, మాచాపూర్, పర్పల్లె, పుట్టపల్లి, ధర్మారం గ్రామ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.