వరద కాల్వ కబ్జా.. వాస‌‌‌‌‌‌‌‌వి బిల్డర్స్ పై హైడ్రా యాక్షన్

వరద కాల్వ కబ్జా.. వాస‌‌‌‌‌‌‌‌వి బిల్డర్స్ పై హైడ్రా యాక్షన్
  • కూకట్​పల్లి పీఎస్​లో కేసు నమోదు
  • బఫర్​ విడిచిపెట్టకుండా నిర్మాణాలు 
  • కాల్వ మ‌‌‌‌‌‌‌‌ధ్యలో పిల్లర్లు  
  • మ‌‌‌‌‌‌‌‌ట్టి పోసిన‌‌‌‌‌‌‌‌ట్టు నిర్ధార‌‌‌‌‌‌‌‌ణ 
  • జేసీబీలు, టిప్పర్లతో తొలగింపు 
  • నిర్మాణ సంస్థ స్థలంలోనే పడేసిన్రు  

హైదరాబాద్ సిటీ, వెలుగు: భ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌త్‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ర్ – ఖైత‌‌‌‌‌‌‌‌లాపూర్ రూట్​లోని కాముని చెరువు, మైస‌‌‌‌‌‌‌‌మ్మ చెరువుల‌‌‌‌‌‌‌‌ను క‌‌‌‌‌‌‌‌లుపుతూ సాగే వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ద కాల్వను క‌‌‌‌‌‌‌‌బ్జా చేసిన వాస‌‌‌‌‌‌‌‌వి బిల్డర్స్​పై హైడ్రా యాక్షన్​కు దిగింది.17 మీట‌‌‌‌‌‌‌‌ర్ల వెడ‌‌‌‌‌‌‌‌ల్పుతో పాటు రెండువైపులా 9 మీట‌‌‌‌‌‌‌‌ర్ల చొప్పున బ‌‌‌‌‌‌‌‌ఫ‌‌‌‌‌‌‌‌ర్ విడిచిపెట్టకుండా నిర్మాణాలు చేప‌‌‌‌‌‌‌‌డుతున్నార‌‌‌‌‌‌‌‌ని స్థానికులు ఫిర్యాదుతో హైడ్రా క‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ర్ ఏవీ రంగ‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌ బుధ‌‌‌‌‌‌‌‌వారం ఫీల్డ్​విజిట్​చేశారు. 

హైటెక్ సిటీ రైల్వేస్టేష‌‌‌‌‌‌‌‌న్ స‌‌‌‌‌‌‌‌మీపంలోని ముల్లక‌‌‌‌‌‌‌‌త్వ చెరువు, -కాముని చెరువు, మైస‌‌‌‌‌‌‌‌మ్మ చెరువుల‌‌‌‌‌‌‌‌ను క‌‌‌‌‌‌‌‌లుపుతూ వెళ్లే వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ద కాల్వలో మ‌‌‌‌‌‌‌‌ట్టి పోసిన‌‌‌‌‌‌‌‌ట్టు నిర్ధార‌‌‌‌‌‌‌‌ణ అయ్యింది. దీంతో సదరు నిర్మాణ సంస్థపై కేసు పెట్టాల‌‌‌‌‌‌‌‌ని అధికారుల‌‌‌‌‌‌‌‌ను రంగనాథ్​ఆదేశించారు. వెంటనే నాలా ఆక్రమ‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌ను తొల‌‌‌‌‌‌‌‌గించాల‌‌‌‌‌‌‌‌ని సూచించారు. దీంతో హైడ్రా స్టాఫ్​జేసీబీలు, టిప్పర్లతో రంగంలోకి దిగి వాసవి సంస్థ వేసిన మ‌‌‌‌‌‌‌‌ట్టిని తొల‌‌‌‌‌‌‌‌గించారు. ఆ మ‌‌‌‌‌‌‌‌ట్టిని సదరు నిర్మాణ సంస్థకు చెందిన స్థలంలోనే ప‌‌‌‌‌‌‌‌డేశారు. వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ద కాల్వ ఆక్రమించి నిర్మాణాలు చేప‌‌‌‌‌‌‌‌డుతున్నారంటూ వాస‌‌‌‌‌‌‌‌వి నిర్మాణ సంస్థపై కూక‌‌‌‌‌‌‌‌ట్‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌ల్లి పోలీస్​ స్టేష‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌లో ఇరిగేష‌‌‌‌‌‌‌‌న్ శాఖ ఏఈ లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. 

మూసాపేట పరిధిలోని సర్వేనెంబర్లు 67, 68, 85, 86లోని స్థలం ద్వారా కాముని చెరువు నాలా ప్రవహిస్తోందని, ఈ నాలా స్థలాన్ని వాసవి బిల్డర్స్​నిర్వాహకులు మట్టితో నింపి కబ్జా చేస్తున్నారని కంప్లయింట్​లో పేర్కొన్నారు. దీంతో కూక‌‌‌‌‌‌‌‌ట్‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌ల్లి పోలీసులు కేసు న‌‌‌‌‌‌‌‌మోదు చేశారు. కొంత‌‌‌‌‌‌‌‌మేర ఇరువైపులా రిటైనింగ్ వాల్స్‌‌‌‌‌‌‌‌తో నిర్మించిన కాల్వ మ‌‌‌‌‌‌‌‌ధ్యలో స్లాబ్ వేసేందుకు ఉద్దేశించిన పిల్లర్లను కూడా తొల‌‌‌‌‌‌‌‌గించాల్సి ఉంద‌‌‌‌‌‌‌‌ని హైడ్రా అధికారులు గుర్తించారు.