మూసీకి తగ్గిన వరద.. మూసారంబాగ్ వంతెన వ‌‌ద్ద భారీగా పేరుకుపోయిన చెత్త

మూసీకి తగ్గిన వరద.. మూసారంబాగ్ వంతెన వ‌‌ద్ద భారీగా పేరుకుపోయిన చెత్త

హైదరాబాద్ సిటీ, వెలుగు: హిమాయత్ సాగర్ నుంచి ఔట్​ఫ్లో తగ్గడంతో మూసీ నదిలో వరద తీవ్రత తగ్గింది. శుక్రవారం ఉదయం నాలుగు గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన జలమండలి అధికారులు.. సాయంత్రం 5 గంటలకు రెండు గేట్లను మూసేశారు. మిగిలిన రెండు గేట్లను 3 అడుగులు ఎత్తి 1,927 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 

అయితే, సాయంత్రం వరకు కొనసాగిన వరదతో ముసారాంబాగ్​లోని దోభి ఘాట్లు, బ్రిడ్జి ఫెన్సింగ్ కొట్టుకుపోయాయి. వరదలో కొట్టుకొచ్చిన చెత్తను హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించింది. ముసానగర్, శంకర్ నగర్, ఛాదర్‌‌ఘాట్ కాలనీల బాధితులు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు.