అస్సోంలోని పలు జిల్లాల్లో వరద పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా బొంగాయ్ గావ్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. వీధులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల కారణంగా అస్సోంలో మృతి చెందిన వారి సంఖ్య 67కు చేరగా…సుమారు 30 లక్షల మందిపై వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పలు జిల్లాల్లో వరదలు తగ్గుముఖం పడుతుండగా..సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
