గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. అధికారులు సోమవారం ప్రాజెక్టు దగ్గర అన్ని గేట్లను క్లోజ్ చేశారు. జెన్ కో ఐడల్ ప్రాజెక్టు వద్ద విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం 317.330 మీటర్ల మేర నీటిని నిల్వ ఉంచుకుని విద్యుత్ ఉత్పత్తి కోసం 41,693 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్ కు 1,500, బీమా లిఫ్ట్ 1కి 650, ప్యార్లర్ కెనాల్ కు 850, బీమా లిఫ్టు-2కు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

