సీపీ అంజనీ కుమార్ ఇంట్లోకి వరద నీరు

సీపీ అంజనీ కుమార్ ఇంట్లోకి వరద నీరు

భారీ వర్షాల ధాటికి భాగ్యనగరం అతలాకుతలమవుతోంది. రోడ్లు, కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద బీభత్సంలోనూ ప్రాణాలు పణంగా పెట్టి, అలుపెరుగక విధులు నిర్వర్తిస్తున్న పోలీసు కుటుంబాలను కూడా వాన కష్టాలు వెంటాడుతున్నాయి. హైదరాబాద్  పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఇంట్లోకి వరద నీరు చేరడంతో… నాలుగు రోజులుగా ఆయన ఆఫీసులోనే ఉంటూ డ్యూటీ చేస్తున్నారు. మరో 300 మంది పోలీసు అధికారుల ఇళ్లలోనూ ఇదే పరిస్థితి. మరోవైపు తమ కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నప్పటికీ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు.

ఫలకునుమా ప్రాంతాల్లో పరిస్థితి అదుపులో ఉందని అంజనీకుమార్‌ తెలిపారు. ఇప్పటికే ఆర్మీని కూడా రంగంలోకి దించామని   తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌ జరుగుతున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని  రావద్దని సూచించారు.