
గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. మంగళవారం 7 గేట్లను ఓపెన్ చేసి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు దగ్గర 318.516 మీటర్ల నీటిని నిల్వ ఉంచుతున్నారు. జూరాలకు 46వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో గా వస్తుండగా, 7 గేట్ల ద్వారా 27,293 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి కోసం 32,656 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ లిఫ్ట్ కు 315 క్యూసెక్కులు, రైట్ కెనాల్ కు 485 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్–-1కు 650 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150 క్యూసెక్కులు, లిఫ్ట్ కెనాల్ కు 920 క్యూసెక్కులు, రైట్ కెనాల్ కు 36 క్యూసెక్కులు, పార్లర్ కెనాల్ కు 450 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్–-2కు 750 క్యూసెక్కులతో కలిపి 62,635 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.