హర్యానాలో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన కారు

హర్యానాలో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన కారు

హర్యానాలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. పంచకులలో జూన్ 25 న వరదల ధాటికి చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఖరక్ మంగోలి నది ఒడ్డున ఓ మహిళ తన కారు పార్క్ చేసింది. వరద కారణంగా కారు నదిలో కొట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. స్థానికులు గమనించి కారు డ్రైవర్ ని రక్షించారు. అనంతరం మహిళను హాస్పిటల్ కి తరలించారు.  

క్రేన్ సాయంతో వాహనాన్ని నదిలోంచి బయటకి తీసేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా, నైరుతి ప్రభావంతో ఇండియాలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.