గోదావరి వరదలు తీరని విషాదం నింపాయి

గోదావరి వరదలు తీరని విషాదం నింపాయి

భద్రాచలం, వెలుగు: వరద బాధితులకు ఆదివారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సాయం చేశారు. రూ.కోటి విలువ చేసే సరుకులను 15 వేల మంది వరద బాధితులకు అందజేశారు. భద్రాచలం టౌన్​లోని పునరావాస కేంద్రాల్లో టీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్​ పేరిట ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆకలితో అలమటిస్తున్న వారి కష్టం కలచి వేసిందని అన్నారు. తనవంతు సాయంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు తెలిపారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో గోదావరి వరదలు తీరని విషాదం నింపాయని చెప్పారు. జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.తెల్లం వెంకట్రావ్, డీసీసీబీ డైరక్టర్​ తుళ్లూరి బ్రహ్మయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్​ పిడమర్తి రవి, కడియం రామాచారి పాల్గొన్నారు.

వరద బాధితులకు అండగా ఉంటా..

బూర్గంపహడ్: గోదావరి వరదలతో నష్టపోయిన వరద బాధితులకు అండగా ఉంటానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. బూర్గంపహడ్ తో పాటు మండలంలోని రెడ్డిపాలెం, సారపాకలలో వరద బాధితులను పరామర్శించి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వరద బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బోటు ప్రమాదంలో 9 మందిని కాపాడిన పిట్టల రమేశ్​ను సన్మానించి రూ.5 వేలు అందించారు. సర్పంచ్ సిరిపురపు స్వప్న, అశ్వాపురం జడ్పీటీసీ సులక్షణ ఉన్నారు.

గిరిజనసంఘం ఆధ్వర్యంలో..

భద్రాద్రికొత్తగూడెం: గోదావరి వరదలతో సర్వం కోల్పోయిన దుమ్ముగూడెం మండలం పర్ణశాల బాధితులకు తెలంగాణ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం నిత్యావసర సరుకులు, దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా సమాఖ్య జిల్లా కార్యదర్శి భుక్యా శ్రీనివాస్​ మాట్లాడుతూ వరద బాధితులకు రూ. 50 వేల పరిహారంతో పాటు డబుల్​ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్​ చేశారు. ఉక్కు నాయక్, రాజు, మంధ్య, గోవర్ధన్, రామకృష్ణ, అంగన్​వాడీ టీచర్​ శ్రీదేవి, వాలి, లక్ష్మి పాల్గొన్నారు.

సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో

పాల్వంచ: పట్టణంలోని సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం భ ద్రాచలం గోదావరి వరద బాధితులకు 15 రోజులకు సరిపడే 13 రకాల నిత్యావసరాలతో తయారు చేసిన అమృత కలశాలను భద్రాచలం తరలించారు. ఈ వాహనాన్ని కేటీపీఎస్ 5, 6 దశల చీఫ్  ఇంజనీర్  కె రవీందర్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. డి రామచంద్రారెడ్డి, ఆర్ అనిల్ కుమార్, వెంకటేశ్, సీహెచ్ రామారావు, మనోహర్ బాబు, పి సాయికృష్ణ, రాధాకృష్ణ, ఏపూరి వెంకటేశ్వర్లు, భాగం మధుసూదన్   తదితరులు 
పాల్గొన్నారు.