
నటి ఫ్లోరా సైనీ.. ఆశా సైనీగా తెలుగు ప్రజలకు బాగా సుపరిచితం అయిన పేరు. చిన్న వయసులోనే తెరంగేట్రం చేసి తన ప్రతిభతో అందరికీ చేరువైంది. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆశా.. తిరిగి సినిమాల్లోకి వస్తున్నట్లు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. అయితే, తనకు 20 ఏళ్లు ఉన్నప్పుడు ఓ నిర్మాతతో ప్రేమలో పడ్డానని, అతను చిత్రహింసలకు గురిచేశాడని పేర్కొంది. తన అనుభవాలతో ఓ వీడియో విడుదల చేసి సంచలన వ్యాఖ్యలు చేసింది.
‘తక్కువ కాలంలోనే పదికిపైగా సినిమాలు చేశా. డిజైనర్ల బ్రాండ్స్ కోసం మోడల్ గా పనిచేశా. ఆ టైంలోనే నిర్మాతతో ప్రేమలో పడ్డా. కొన్ని రోజులకే పరిస్థితులు మారిపోయాయి. అతను నన్ను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. ముఖం, ఇతర ప్రైవేట్ పార్ట్స్ పై కొట్టేవాడు. మొబైల్ ఫోన్ లాక్కుని ఎవరితో మాట్లాడనీయలేదు. నటించడం మానేయమన్నాడు. 14 నెలలపాటు నిర్భందించాడు. ఒకరోజు సాయంత్రం కడుపులో తన్నాడు. దాంతో ఆ బాదలన్నీ భరించలేక అక్కడినుంచి పారిపోయి అమ్మానాన్నలతో కలిసి ఉన్నా. అతని నుంచి బయటపడటానికి చాలా నెలల టైం పట్టింది. తర్వాత అన్నీ చక్క బడ్డాయి. కొత్త బంధంలోకి అడుగుపెడుతున్నా. దానికి మీ అందరి ఆశిస్సులు కావాల’ని వీడియోలో తెలిపింది.