కుక్కను చంపినందుకు పదేండ్లు జైలు శిక్ష

కుక్కను చంపినందుకు పదేండ్లు జైలు శిక్ష

మయామి: ఓ కుక్కపిల్లను దారుణంగా హింసించి, చంపేసిన వ్యక్తికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష వేసింది. నాలుగేండ్ల కిందట అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఓలీ అనే కుక్క పిల్లను కొట్టి, కత్తితో పొడిచి చంపాడని బ్రెండన్​ ఇవాన్స్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కత్తితో కుక్కపిల్లను యాభైసార్లు పొడిచాడని, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కుక్కను సూట్​కేసులో కుక్కాడని పోలీసులు ఆరోపించారు. చుట్టుపక్కల వాళ్లు దానిని గుర్తించి, ఆస్పత్రికి తీసుకెళ్లగా.. రెండు రోజుల తర్వాత కుక్క చనిపోయిందని చెప్పారు. ఈ ఆరోపణలను బ్రెండన్​ కొట్టిపారేశాడు. బ్రెండన్​ ఇంట్లోని ఫ్రీజర్​లో పిల్లి పాదాలు, తలలు కత్తిరించిన ఎలుకలు, బాత్రూంలో రక్తపు మరకలు, ఓవెన్‌‌లో రక్తం, జంతువుల వెంట్రుకలను గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.