లాలూ ప్రసాద్ యాదవ్కు బెయిల్

లాలూ ప్రసాద్ యాదవ్కు బెయిల్

పాట్నా: దాణా కుంభకోణం కేసులో అరెస్టయి శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ చీఫ్​ లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ లభించింది. లాలూకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఐదేళ్ల పాటు శిక్ష పడిన ఈ కేసులో.. లాలూ ఇప్పటికే 42 నెలలు జైలులో గడిపారనే విషయాన్ని వాదనల సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సీబీఐ వ్యతిరేకించినా డోరండ ట్రెజరీ కేసులో లాలూకు కోర్టు బెయిల్ ఇచ్చిందని ఆయన తరఫున వాదించిన లాయర్ ప్రభాత్ కుమార్ తెలిపారు. 

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభంలో ఐదో పశుగ్రాసం కుంభకోణంలో లాలూకు సీబీఐ కోర్టు ఐదేళ్ల శిక్షతోపాటు రూ. 60 లక్షల జరిమానా విధించింది. 1990ల్లో ఈ కుంభకోణం చోటు చేసుకుంది. డోరండ ట్రెజరీ నుంచి రూ. 139.5 కోట్లను చట్ట విరుద్ధంగా విత్ డ్రా చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఆ సమయంలో బిహార్ సీఎంగా లాలూ ఉన్నారు. దాణా కుంభకోణానికి సంబంధించి మరో కేసు పాట్నాలోని సీబీఐ కోర్టులో పెండింగ్ లో ఉంది. భాగల్పూర్ ట్రెజరీ నుంచి అక్రమంగా నిధులను విత్ డ్రా చేశారంటూ ఈ కేసు నమోదైంది. 

మరిన్ని వార్తల కోసం:

రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు

రెండ్రోజుల్లో మోడీ విజిట్.. కశ్మీర్లో ఎన్కౌంటర్