ఒడిశాలో తప్పిన ఘోర రైలు ప్రమాదం

ఒడిశాలో తప్పిన ఘోర రైలు ప్రమాదం

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. భారీ పొగమంచు కారణంగా ముంబై-భువనేశ్వర్ లోక్‌మాన్య తిలక్ టెర్మినస్(LTT) ప్రమాదానికి గురైంది. కటక్‌లోని సలాగావ్-నిర్గుండి రైల్వే స్టేషన్ మధ్య గూడ్స్‌ రైలును ఢీకొట్టింది. దీంతో ఐదు బోగీలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  గాయపడిన వారిని కటక్  ఆస్పత్రికి తరలించారు.

ముంబై నుంచి భువనేశ్వర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలిపారు రైల్వే అధికారులు.

LTT ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్-(0764) 1072, (0674), 1072 కు కాల్ చేయవచ్చని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు సూచించారు. ఈ ప్రమాదంతో పలు రైళ్ల కపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.