ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ రాజకీయ కుట్ర : వైఎస్ జగన్ ట్వీట్

ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ రాజకీయ కుట్ర : వైఎస్ జగన్ ట్వీట్

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ కేసులో సుదీర్ఘ విచారణ సిట్ బృందం ఆదివారం ( జులై 20 ) ఏసీబీ కోర్టు ఆదేశాలతో రిమాండ్ కి తరలించింది. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఎక్స్ వేదికగా ఖండించారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ ముమ్మాటికీ రాజకీయ కుట్ర అని అన్నారు. మిథున్ రెడ్డి అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నానని.. ఇది ప్రజల తరపున పోరాడేవారి గొంతు నొక్కే కార్యక్రమమని అన్నారు జగన్. బలవంతపు వాంగ్మూలాల ద్వారా తప్పుడు కేసులో ఇరికించారని.. టీడీపీ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు  జగన్. 

ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని.. లేని లిక్కర్ స్కాంను ఉన్నట్లుగా చూపించి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టుగా చూపించి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. లిక్కర్ కేసు అంతా ప్రలోభాలు, బెదిరింపులు, థర్డ్ డిగ్రీ ద్వారా టపుడు వాంగ్మూలాలు తీసుకొని నడిపిస్తున్నదేనని అన్నారు. చంద్రబాబు తన హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో బెయిల్ మీద ఉన్నారని గుర్తు చేశారు జగన్.

 

చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో సహా కేసు నమోదయ్యిందని.. ఆ కేసు కొట్టేయించేందుకు ఇప్పటి పాలసీని సమర్థించుకునేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు జగన్.

Also Read:-ఎన్ని వందల మందిని జైలుకు పంపినా వైసీపీని అణచలేరు

ఒకపక్క చంద్రబాబు తప్పు చేస్తూనే మరో పక్క వైసీపీ ప్రభుత్వ హయాంలో రూపొందించిన పాలసీని తప్పుబడుతున్నారని అన్నారు జగన్. ప్రస్తుతం తన హయాంలో అవినీతి పద్దతులను మళ్ళీ ప్రారంభించారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్టు షాపులు, పర్మిట్ రూంలు వెలిశాయని అన్నారు జగన్. తమ ప్రభుత్వ హయాంలో వేలాది బెల్టుషాపులు, పర్మిట్ రూమ్లను మూయించామని.. మద్యం షాపులు కూడా తగ్గించమని అన్నారు జగన్.