చెప్పులు నోట్లో పెట్టి.. యూరిన్ తాగించి..భూతవైద్యం పేరుతో ఈ బాబా ఎలాంటి పనులు చేస్తున్నాడో చూండండి !

 చెప్పులు నోట్లో పెట్టి.. యూరిన్ తాగించి..భూతవైద్యం పేరుతో ఈ బాబా ఎలాంటి పనులు చేస్తున్నాడో చూండండి !

మనిషి మార్స్ పై కాలు మోపుతున్నాడు.. కానీ ఇంకా మూఢ విశ్వాసాల నుంచి బయటపడలేక పోతున్నాడు. దెయ్యాలు, భూతాలు అంటూ బాబాల చుట్టూ.. భూత వైద్యుల చుట్టూ తిరిగే అమాయకులు ఇంకా  ఉన్నారు. ఇలాంటి అమాయకుల అవసరాలను, సమస్యలను ఆసరాగా చేసుకుని అదే వృత్తిగా కొందరు బతికేస్తున్నారు. ఇక్కడ మాట్లాడుకుంటున్న బాబా భూతాలను వదిలిస్తానని చెప్పి నోట్లో చెప్పులు పెట్టడం.. మూత్రం తాగించడం లాంటి చెప్పడానికే అసహ్యమైన పనులు చేయిస్తూ కెమెరాకు చిక్కాడు. 

మహారాష్ట్ర శంభాజీనగర్ లో భూతవైద్యుడు తన దగ్గరకు వచ్చే రోగులను చిత్ర విచిత్రమైన చేష్టలతో నరకం చూపిస్తుంటాడు. ఏమైనా అంటే పట్టిన దెయ్యం వదలాలంటే ఇలా చేయాల్సిందేనని చెప్తుంటాడు. ఆరోగ్యం బాలేక, లేదంటే మతిస్థితిమితం లేకనో.. షాక్ గురై తెలివి కోల్పోయిన వాళ్లో వస్తే వాళ్లను భూత వైద్యం పేరుతో చిత్ర హింసలు పెడుతున్నాడు. కర్రలతో దారుణంగా కొట్టడం, తన్నడం, వాళ్లను పడుకోబెట్టి వాళ్లపై నిలబడటం.. ఇలా విచిత్రమైన పనులు చేస్తున్నాడు. 

ఈ బాబా చేస్తున్న హింసాత్మక, అమానవీయ చర్యలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. భూతవైద్యం నెపంతో మహిళలను ఎక్కడ పడితే అక్కడ తాకడం కూడా చేస్తున్నట్లు కంప్లైంట్ ఇచ్చారు. 

సంజయ్ రంగనాథ్ పగార్ అనే బాబా.. వీడియోలో కనిపిస్తున్నట్లుగా.. ఒక వ్యక్తి మీద కలర్ వాటర్ పోస్తూ .. అల్కాశ్ నిరంజన్.. అల్కాశ్ నిరంజన్.. అని పెద్దగా అరుస్తున్నాడు. ఆ సమయంలో అతని అనుచరులు డ్రమ్స్ వాయిస్తున్నారు. సడెన్ గా ఆ యువకుడిని లేపి ముక్కుపై చెప్పుతో గట్టిగా కొట్టడం విజువల్స్ లో చూడవచ్చు. 

Also Read:-హైదరాబాద్లో కలకలం.. కారు డ్రైవింగ్ సీటులో డెడ్ బాడీ.. ముందు మందు బాటిల్ !

జులై 17న ఈ వీడియో రికార్డయ్యింది. యువకుడిని పడుకొమ్మ ని చెప్పి.. మెడపై కాలు పెట్టి.. కడుపుపై కర్రతో బెదిరిస్తూ ఉన్నాడు. ఛత్రపతి శంభాజీ నగర్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వీడియో తీసి పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాబా చేస్తున్న దారుణ చర్యలను వీడియో తీసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో .. సదరు బాబా పరారయ్యాడు. మూఢవిశ్వాలను పెంచి పోషించడమే కాకుండా అమాయకులను భయభ్రాంతులకు గురిచేస్తూ.. అమానవీయ చర్యలకు పాల్పడినందకు కేసు నమోదు చేశారు పోలీసులు.