స్వర్ణలతకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్థిక సాయం

స్వర్ణలతకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్థిక సాయం

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో భవిష్యవాణి వినిపించే స్వర్ణలతకు మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. మారేడ్​పల్లిలో నివసించే స్వర్ణలతకు ఇటీవల డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కేటాయించారు. బోనాల సందర్భంగా స్వర్ణలత ఇంటి రిపేర్లకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు తెలిసింది. లక్ష రూపాయలు అవసరమని తెలియగా, మంత్రి వెంటనే తన వ్యక్తిగత సహాయకుడి ద్వారా ఆ మొత్తాన్ని ఈవో చేతుల మీదుగా స్వర్ణలతకు శనివారం అందించారు.