
తెలంగాణ రాష్ట్రంపై ప్రశంసలు కురిపించింది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. తెలంగాణను రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా వర్ణించింది. ఈ సందర్భంగా FCI జనరల్ మేనేజర్ అశ్విని కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో పలు రిజర్వాయర్లు నిండటం.. కాళేశ్వరం ఎత్తిపోతల, ఫ్రీ కరెంట్ లతో పంట దిగిబడి చాలా పెరిగిందన్నారు. యాసంగిలో పంట దిగుబడి ఎక్కువగా వచ్చిందని.. ప్రజలకు బియ్యం కొరత లేదని తెలిపారు. దీంతో లాక్ డౌన్ లో ప్రజలకు ఎక్కువ రైస్ ఇచ్చారని తెలిపారు.