చెప్పిన టైమ్కి రావటం కష్టం : ట్రాఫిక్తో చేతులెత్తేసిన ఫుడ్ డెలివరీ యాప్స్

చెప్పిన టైమ్కి రావటం కష్టం : ట్రాఫిక్తో చేతులెత్తేసిన ఫుడ్ డెలివరీ యాప్స్

గ్రేటర్ హైద‌రాబాద్ లో ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇండ్లకే ప‌రిమిత‌మైన చాలా మంది.. ఆహారాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటున్నారు. అయితే.. ఫుడ్ డెలివ‌రీ యాప్స్ క‌స్టమ‌ర్ల ఆర్డర్లను నిరాక‌రిస్తున్నాయి.

భారీ వర్షాల కారణంగా ఫుడ్ డెలివ‌రీ బాయ్స్ ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వ‌ర‌ద నీరు నిలిచిపోవ‌డం, ప‌లు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావ‌డంతో డెలివ‌రీ బాయ్స్ ఇబ్బందులు పడుతున్నారు.

డెలివ‌రీ బాయ్స్ అందుబాటులో లేక‌పోవ‌డంతో క‌స్టమ‌ర్ల ఆర్డర్లను ఫుడ్ డెలివ‌రీ యాప్స్ నిరాక‌రిస్తున్నాయి. ఒక వేళ బుక్ అయినా.. వాటిని డెలివ‌రీ చేసేందుకు ఎక్కువ స‌మ‌యం ప‌డుతోందని కస్టమర్లు చెబుతున్నారు. 

భారీ వ‌ర్షంలో ఫుడ్ డెలివ‌రీ చేయ‌డం క‌ష్టంగా మారింద‌ంటున్నారు ఫుడ్ డెలవరీ బాయ్స్. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవ‌డంతో వెహికల్స్ నెమ్మదిగా క‌దులుతున్నాయ‌ని చెబుతున్నారు. నెట్‌వ‌ర్క్‌లో కూడా స‌మ‌స్యలు ఏర్పడ‌టంతో ఫుడ్ డెలివ‌రీకి ఇబ్బందిగా మారింద‌ని చెబుతున్నారు.