
సంగారెడ్డి జిల్లా: నారాయణఖేడ్ జూకల్ శివారులో గల సోషల్ వెల్ఫేర్ స్కూల్ లోని 19 మంది స్టూడెంట్స్ కి ఫుడ్ పాయిజన్ అయింది. భోజనం చేసిన విద్యార్థులు ఒకరి తర్వాత మరొకరుగా వాంతులు, విరేచనాలకు గురయ్యారు. అనుమానంతో టీచర్లు ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. ఫుడ్ పాయిజన్ జరిగిందేమోనని అనుమానించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు 19 మంది విద్యార్థులు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొంత మందిని కూడా చేర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులందరి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. విద్యాశాఖ వర్గాల్లో ఈ సంఘటన కలకలం రేపింది.
for more news..
ఏటీఎంలలో చిలక్కొట్టుడు కొడుతుంటే.. ఏడాది తర్వాత బయటపడింది
ఏడేళ్లకే ఐటీ కంపెనీ..13 ఏళ్లకే బీటెక్ స్టూడెంట్స్‌కు క్లాసులు