V6 News

హైదరాబాద్ మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 44 మంది విద్యార్థులకు అస్వస్థత

హైదరాబాద్ మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 44 మంది విద్యార్థులకు అస్వస్థత

హైదరాబాద్ మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. చంద్రనాయక్ తాండ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ జరగటంతో 44 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన గంట తర్వాత కడుపు నొప్పి తో విద్యార్థులు బాధపడ్డారు.

దీంతో విద్యార్థులను కొండాపూర్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే అస్వస్థతకు గురైనట్టు ప్రాథమికంగా నిర్ధారించారు వైద్యులు. టీచర్లు ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు.

ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో నానక్ రాం గూడా రెయిన్ బో హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం 38 మంది విద్యార్థులు కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.