
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించే విషయంలో ప్రభుత్వంతో కలిసి రావాలని ఐటిసి లిమిటెడ్ ను కోరారు సీఎం కేసీఆర్. ఐటిసి చైర్మన్ సంజీవ్ పురి, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ నకుల్ ఆనంద్…క్యాంప్ ఆఫీస్ లో సీఎంతో సమావేశమయ్యారు. ముడి సరుకు సేకరణ, ఇతరత్రా అంశాల్లో మహిళల సేవలను వినియోగించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఐటీసీ మేనేజ్ మెంట్ ను కోరారు సీఎం. ఇక…మెదక్ జిల్లా మనోహరాబాద్ సమీపంలో రూ.800 కోట్ల వ్యయంతో ఐటిసి చేపట్టిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని… రెండు మూడు నెలల్లో ప్రారంభిస్తామని సీఎంకు వివరించారు సంజీవ్ పురి.
వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర రావడం కోసం, ప్రజలకు కల్తీలేని ఆహార పదార్ధాలు అందడం కోసం పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగ పెట్టుకున్నది. ఈ లక్ష్య సాధనకు ఈ రంగంలో అనుభవం కలిగిన ఐటిసి కలిసి రావాలి: సీఎం శ్రీ కేసీఆర్ pic.twitter.com/JVSfTiq6pf
— Telangana CMO (@TelanganaCMO) August 3, 2019