
హైదరాబాద్ నగరంలో కల్తీ ఫుడ్, నాణ్యతలేని ఫుడ్ వల్ల ప్రజల ప్రాణాల మీదకు వస్తుంది. ఇష్టారీతిన హోటల్స్, రెస్టారెంట్లు,స్వీట్ షాపుల్లో కల్లీ కలకలం సృష్టిస్తోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది . ఈ క్రమంలోనే పలువురు ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ అధికారులు ఈ మధ్య హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నిన్నటి వరకు రెస్టారెంట్లు,హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇపుడు స్వీట్ షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు. జూన్ 11 నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా పలు స్వీట్ షాప్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి. కర్ణ ఆదేశాలతో 29 స్వీట్ షాప్స్ లో తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఎక్స్ పైర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్లు గుర్తించారు.
స్వీట్ షాపుల్లో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబెల్, ఎక్స్ పైరీ డేట్ లేదని చెప్పారు అధికారులు. అలాగే కిచెన్ లో పని చేసే వారు హెడ్ కాప్స్, గ్లౌజ్, యాప్రాన్స్ వేసుకోకుండా పనిచేస్తున్నారని చెప్పారు. కిచెన్ లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. FSSAI సర్టిఫికెట్స్ ఎక్స్ పైర్ అయినా రెన్యువల్ చేయించుకోకుండా స్వీట్ షాప్స్ నిర్వహిస్తున్నారు. కల్తీ స్వీట్స్ గానీ, నిబంధనలకు రెస్టారెంట్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని స్వీట్ షాపులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ALSO READ | హైదరాబాద్ సిటీలో మాంగళ్య షాపింగ్ మాల్ సీజ్ : GHMC చెబుతున్న కారణం ఇదే..!
రెండు రోజుల క్రితం తార్నాకలోని డెక్కన్ పామ్ రెస్టారెంట్ లో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. రెస్టారెంట్ కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. కుళ్లిపోయిన చికెన్ తో బిర్యానీ చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్లు గుర్తించారు.రెస్టారెంట్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫుడ్ సేఫ్టీ విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని ఇప్పటికే హెల్త్ మినిస్టర్ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. నాణ్యమైన ఫుడ్ అందించే వారికి అండగా ఉంటామని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే చట్టప్రకారం చర్యలు తప్పవని అన్నారు. హోటల్స్, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్తో పాటు హాస్టళ్లు, హాస్పిటల్స్, వర్క్ ప్లేసుల్లో ఉండే క్యాంటీన్లు కూడా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాల్సిందే అని స్పష్టం చేశారు.