మంచిర్యాల జిల్లాలో తవ్వకాల్లో బయటపడిన అమ్మవారి విగ్రహం

మంచిర్యాల జిల్లాలో తవ్వకాల్లో బయటపడిన అమ్మవారి విగ్రహం

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో తవ్వకాల్లో అమ్మవారి విగ్రహం బయటపడింది. మంచిర్యాల జిల్లా ముల్కల గ్రామంలో గోదావరి నదికి హారతి ఇవ్వడానికి వెళ్లిన పీఠాధిపతులకు.. పోచమ్మ గుడి ప్రక్కన ఉన్న భూమిలో శక్తి స్వరూపం కనిపించిందని గ్రామస్తులు చెప్పారు. తవ్వకాలు చేపట్టడంతో భూమిలో నుంచి పురాతన అమ్మవారి విగ్రహం బయట పడింది. వేద మంత్రోచ్ఛరణలతో అమ్మవారి విగ్రహానికి పూజలు చేశారు. అమ్మవారి విగ్రహాన్ని చూడడానికి భక్తులు తండోపతండాలుగా కదిలి వచ్చారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఉత్తర భారతదేశ పీఠాధిపతులు, సాధువులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి పరిక్రమణ యాత్రలో భాగంగా యానాం నుంచి ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్లోని బృందావన్ పీఠానికి చెందిన మలుక్ పీఠాధిపతి జగద్గురు దావరాచార్య రాజేంద్ర దాస్ జీ మహరాజ్తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన సాధువులు, మండలేశ్వర్లు, మహా మండలేశ్వర్లు సుమారు 600 మంది సాధువులు కాళేశ్వరం చేరుకొని బస చేశారు. సోమవారం ఉదయం పీఠాధిపతులు, సాధువులు పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, నదిమాతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు.  పీఠాధిపతి గురుదావరా చార్య స్వామి భక్తులకు ప్రవచనాలు విలపించారు.ఉత్తర భారతదేశం ప్రయాగ్ రాజ్లో గంగా, యుమునా, సరస్వతి త్రివేణి సంగమం ఎలాగో.. దక్షిణ భారతదేశంలోని కాళేశ్వర క్షేత్రంలో గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదులుతో కూడిన త్రివేణి సంగమం అలా ఎంతో ప్రాశస్త్యం కలిగిందన్నారు. ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే యమ బాధలు తొలిగిపోతాయని, కాళేశ్వరం త్రివేణి సంగమంలో స్నానాలు అచరించి, స్వామివారిని దర్శించుకుంటే ముక్తిని ప్రసాదిస్తాడని అన్నారు.