Mowgli Collection: బ్రేక్ ఈవెన్కు దూరంగా ‘మోగ్లీ’.. 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?

Mowgli Collection: బ్రేక్ ఈవెన్కు దూరంగా ‘మోగ్లీ’.. 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?

డైరెక్టర్ సందీప్ రాజ్ తెరకెక్కించిన ‘మోగ్లీ’ (Mowgli) డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. డిసెంబర్ 13న రిలీజైన మోగ్లీ.. ఫస్ట్ డే + ప్రీమియర్‌లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.1.22 కోట్ల గ్రాస్ సాధించింది. లేటెస్ట్గా (డిసెంబర్ 15న) మోగ్లీ రెండు రోజుల బాక్సాఫీస్ వసూళ్లను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మోగ్లీ 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.2.75 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకుందని తెలిపారు. మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ వసూళ్లు సాధించినట్లు వివరాలు వెల్లడించారు. 

ఇండియా నెట్ వసూళ్ల విషయానికి వస్తే, తొలిరోజు డిసెంబర్ 13న రూ.75 లక్షలు, ఆదివారం రూ.70 లక్షలు వసూళ్ళు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ సినిమాకు పోటీగా థియేటర్లో అఖండ 2 ఉండటం, కొన్ని వర్గాల నుంచి మిక్సెస్ టాక్ రావడం, తక్కువ థియేటర్లు కేటాయించడం మోగ్లీకి మైనస్గా నిలిచింది. ఈ క్రమంలోనే మోగ్లీ వసూళ్లలో నిరాశపరిచినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో ప్యూర్ ఇన్నోసెన్స్ లవ్ స్టోరీగా ‘మోగ్లీ’ తెరకెక్కింది.

మోగ్లీ బ్రేక్ ఈవెన్ టార్గెట్:

రోషన్ కనకాల పూర్తి ఎఫర్ట్స్ పెట్టి నటించిన మోగ్లీ వసూళ్లలో నిరాశపరుస్తుంది. రెండు రోజులకు కలిపి కేవలం రెండున్నర కోట్లే రాబట్టడం మేకర్స్లో టెన్షన్ పెంచుతోంది. దాదాపు రూ.4కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన మోగ్లీ, సక్సెస్కు చాలా దూరంలో ఉంది.

ఈ క్రమంలో మోగ్లీ బ్రేక్ ఈవెన్ కావాలంటే.. రూ.5 కోట్ల షేర్ కలెక్షన్లతో పాటు రూ.10 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాల అంచనాలు చెబుతున్నాయి. అయితే, వీకెండ్ అయిన.. శని, ఆది వారాల్లోనే ఇంత నత్తనడక కలెక్షన్స్ వచ్చాయి. ఇది కూడా ఆగిపోయి వసూళ్లకు బ్రేక్ పడితే.. బాక్సాఫీస్ వద్ద రోషన్ టఫ్ ఫైట్ ఎదుర్కోవడం తప్పదని నిపుణులు భావిస్తున్నారు.