సూపర్ మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు..కాలం చెల్లిన పండ్లు, వస్తువుల గుర్తింపు

సూపర్ మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు..కాలం చెల్లిన పండ్లు, వస్తువుల గుర్తింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సూపర్ మార్కెట్లపై జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ వింగ్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. 44 సూపర్ మార్కెట్లపై దాడులు జరిపిన అధికారులు.. 58 శ్యాంపిళ్లను సేకరించి ల్యాబ్​కు పంపారు. చాలా స్టోర్లలో పురుగులు, దుమ్ము, కాలం చెల్లిన  ఆహార పదార్థాలను గుర్తించారు. 

సైదాబాద్​లోని మోర్,  కాచిగూడ రిలయన్స్,  కొండాపూర్ విజేత సూపర్ మార్కెట్,  కేపీఎన్ ఫామ్, రత్నదీప్ సూపర్ మార్కెట్లో ఈ తనిఖీలు జరిగాయి. అలాగే కూకట్​పల్లి సర్కిల్​ వివేకానందనగర్​ కాలనీలోని ఎకో సిరి మిల్లెట్​ఫుడ్​కోర్టులోనూ తనిఖీలు చేశారు. శుభ్రత పాటించకపోవడంతో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.