
షాపింగ్, సినిమా, ఎంటర్టైన్మెంట్ కోసం ఇనార్బిట్ మాల్స్ కు రెగ్యులర్ గా వెళ్లేవాళ్లు చాలా మందే ఉంటారు. సరదాగా అలా టైమ్ పాస్ కు కూడా వెళ్లి వచ్చేవాళ్లున్నారు. హైదరాబాద్ లో అంత ఫేమస్ ఈ మాల్స్. రిచ్ లుక్ లో.. కాస్ట్లీ ఐటమ్స్ తో ఉండే ఈ మాల్స్ క్వాలిటీ కూడా అంతే ఉంటుందనుకుంటే పొరపాటు పడినట్లే. ఈ మాల్స్ లో ఉండే అబ్సల్యూట్ బార్బిక్ ఔట్ లెట్స్ లో ఫుడ్ ఎలా ఉంటుందో తెలిస్తే షాకవుతారు.
హైదరాబాద్ సిటీలో ఉన్న 10 అబ్సల్యూట్ బార్బిక్యూ ఔట్ లెట్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం (సెప్టెంబర్ 10) తనిఖీలు నిర్వహించారు. ఈ ఔట్ లెట్స్ లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని గుర్తించారు అధికారులు. తనిఖీల్లో భాగంగా కిచెన్ పరిసరాలను పరిశీలించారు. పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిపారు.
బంజారాహిల్స్, గచ్చిబౌలి ఔట్ లెట్ల కిచెన్, స్టోర్ రూమ్ లలో బొద్దింకలు, ఈగలు ఉన్నట్లు గుర్తించారు. ఇనార్బిట్ మాల్ లో ఉన్న అబ్సల్యూట్ బార్బిక్యూ లో కుళ్ళిపోయిన ఫ్రూట్స్ ను సర్వ్ చేస్తున్నట్లు గుర్తించారు.
మేడిపల్లి ఔట్ లెట్ లో ఎక్స్పైరీ అయిన ఫుడ్ తిరిగి సర్వ్ చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఏ ఎస్ రావు నగర్ ఔ లోని స్టోర్ రూమ్ లో కిచెన్ లో.. ఆహార పదార్థాలపై ఎలుకలు తిరుగుతున్నట్లు గుర్తించారు. ఫ్లోర్ పైనే ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేయడం చూసి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలాంటి నిబంధనలు పాటించకుండా.. కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న అబ్సల్యూట్ బార్బిక్యూ నిర్వాహకులకు నోటీసులిచ్చారు అధికారులు. శాంపిల్స్ సేకరించి టెస్ట్ ల కోసం ల్యాబ్ కు పంపించినట్లు తెలిపారు.