బ్రాండెడ్ హోటల్.. డర్టీ కిచెన్​

బ్రాండెడ్ హోటల్..  డర్టీ కిచెన్​
  • సిటీలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు క్లీన్ గా లేవు
  • పెద్ద హోటళ్లలోనూ శుభ్రంగా వండట్లే​​
  • చాలా వాటిలో  కుళ్లిన మాంసంతో తయారు 
  • గడువు తీరిన ఆహార పదార్థాల వాడకం

‘‘సోమాజిగూడలోని కృతుంగా, హెడ్​క్వార్టర్స్ రెస్ట్​ ఓ బార్​, కేఎఫ్​సీ, జూబ్లీహిల్స్​లోని బాబిలోన్​బార్​అండ్ కిచెన్​, గౌరంగ్​కిచెన్​, పంజాగుట్టలోని షాన్​బాగ్​, చట్నీస్​, బేగంపేటలోని ఐటీసీ కాకతీయ, జీవీకే  వన్​లోని సిజిలింగ్​ జాయ్​, మొజంజాహి మార్కెట్​లోని కరాచీ బేకరీ, మాదాపూర్​లోని బిగ్​బాస్కెట్​గోదాం, రామేశ్వరం కేఫ్, బాహుబలి ఖానా..  ఇవి సిటీలో  పేరున్న హోటళ్లే!   కానీ  పేరుకు తగ్గట్టు, అడ్వర్టైజ్​మెంట్ల కు తగ్గట్టు  వీటిలో క్వాలిటీ ఫుడ్​వడ్డిస్తున్నారనుకుంటే మీరు పొరబడినట్టే..!  ఈ హోటళ్ల లో తనిఖీలు చేసిన అధికారులు కిచెన్ల  నిర్వాహణ చూసి విస్తుపోయారు. మెయింటెనెన్స్ అధ్వాన్నంగా ఉందని ఉందని అధికారులు గుర్తించారు’’. 

హైదరాబాద్, వెలుగు : పేరుకే పెద్ద హోటళ్లు.. వేలల్లో ధర.. బ్రాండ్​ పేరుతో అడ్వర్టైజ్​మెంట్లు.. ఒక్కసారి విజిట్ చేస్తే మరిచిపోలేని హాస్పిటాలిటి అని ప్రమోషన్..  అంతా బాగానే ఉన్నా హోటల్​అన్నాక ఫుడ్​క్వాలిటీగా ఉండాలి కదా..  అదే మిస్​అవుతోంది. ఆకర్షించే  డైనింగ్​హాల్, కాస్లీ కట్లెరీ తో కస్టమర్లను ఆకర్షిస్తున్నా.. ఆ హోటల్​కిచెన్​మాత్రం డర్టీగా ఉంటోంది.  వేల రూపాయల్లో  కస్టమర్లు చెల్లించే ధరలు ఆహారం కోసం కాకుండా..  హోటల్​వాతావరణం కోసమా? అన్నట్టు  మారింది హైదరాబాద్ లో హోటళ్ల పరిస్థితి.

అనేక హోటళ్లు, రెస్టారెంట్లలో కిచెన్​చూసి ఉన్నతాధికారులు సైతం విస్తుపోయారు. సిటీలో పెద్ద సంఖ్యలో ఆహార కల్తీ పై ఫిర్యాదులు వస్తుండడంతో నెల రోజులుగా ఫుడ్​సేఫ్టీ అధికారులు ఎన్​ఫోర్స్​మెంట్​టీమ్స్​తో పలు హోటళ్లపై దాడులు నిర్వహించారు. గ్రేటర్​సిటీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు,  గోదాములను అధికారులు తనిఖీ చేశారు.

అపరిశుభ్ర వాతావరణ పరిస్థితుల్లో హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్​సరఫరా చేయడంపై అధికారులు సీరియస్​అయ్యారు. చాలా హోటళ్లు, రెస్టారెంట్​లో నిల్వచేసిన ఆహారాన్నే మళ్లీ వండి వడ్డిస్తున్నారు. ఫ్రిజుల్లో  రోజుల తరబడి నిల్వ చేసిన చికెన్​, మటన్​కు రసాయనాలతో కూడిన రంగులు పూసిన ఫుడ్ ను కస్టమర్లకు వడ్డిస్తున్నారు.  అన్​సేఫ్​, మిస్​బ్రాండింగ్, నాసిరకం కేటగిరీల్లో అధికారులు నిర్వహిం

చిన తనిఖీల్లో ఇలాంటి విస్తుపోయే నిజాలే బయటపడ్డాయి.  ఫ్రిజ్​ల్లో నిల్వచేయడంతో కంపు కొడుతున్న మాంసాన్ని కూడా ఫ్రెష్​గా ఉంచేందుకు రసాయనాలను చల్లుతున్నట్టు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. కొన్ని చోట్ల కుళ్లిన మాంసంతో బిర్యానీ, గడువు తీరిన మసాలాలు, ఇతర సరుకులను వంటలకు వాడుతున్నట్టు కూడా తేలింది. 

అపరిశుభ్రమైన కిచెన్లు

సిటీలోని హోటళ్లు, రెస్టారెంట్ల కిచెన్లలో అపరిశుభ్ర వాతావరణం ఉంది. అక్కడే వంట చేయడం, పాత్రలు శుభ్రం చేయడం, ముగురు నీరు పారుతుండడం కనిపించింది. మొత్తంగా భరించలేని దుర్వాసనలు వెదజల్లుతుంది.  సోమాజిగూడలోని కృతుంగ, హెడ్​క్వార్టర్స్ రెస్ట్​ ఓ బార్​, కేఎఫ్​సీ, జూబ్లీహిల్స్​లోని బాబిలోన్​ బార్​అండ్ కిచెన్​, గౌరంగ్​కిచెన్​, పంజాగుట్టలోని షాన్​బాగ్​, చట్నీస్​, బేగంపేటలోని ఐటీసీ కాకతీయ, జీవీకే వన్​లోని సిజిలింగ్​ జాయ్, మొజంజాహి మార్కెట్​లోని కరాచీబేకరీ, మాదాపూర్​లోని బిగ్​బాస్కెట్​గోడౌన్, రామేశ్వరం కేఫ్​, బాహుబలి ఖానా వంటి హోటళ్లలో  అధ్వానంగా ఉందని అధికారులు తెలిపారు. 

పెద్ద సంఖ్యలో కేసులు  

 గ్రేటర్​ సిటీలో తనిఖీలు నిర్వహిస్తున్న ఫుడ్​సేఫ్టీ, జీహెచ్​ఎంసీ అధికారుల బృందాలు కొన్ని హోటళ్లకు పెద్దమొత్తంలో జరిమానా విధించగా, కొన్నింటి లైసెన్స్​రద్దుకు సిఫారసు చేశాయని జీహెచ్​ఎంసీ ఫుడ్​ కంట్రోలర్​బాలాజీ రాజు తెలిపారు.  120 హోటళ్లలో తనిఖీలు చేయగా.. 40 హోటళ్లకు నోటీసులు ఇచ్చామని, మరో 15 హోటళ్ల పై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.  రాబోయే  రోజుల్లో మరిన్ని తనిఖీలు ముమ్మరం చేయనున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా హోటళ్లు మాంసం కొనుగోళ్లను జీహెచ్​ఎంసీ కబేళాల నుంచే స్టాంపింగ్​అయిన మటన్​నే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

త్వరలో సిటీలో  మటన్​షాపులను కూడా తనిఖీ చేస్తామన్నారు. మొబైల్​ టెస్టింగ్​ల్యాబ్​లను కూడా రంగంలోకి దించి రోజుకు 20 శాంపిల్స్​సేకరిస్తున్నట్టు తెలిపారు. ఆహారంలో కల్తీ సరుకులు వాడకూడదని, ప్రతి హోటల్​లో శిక్షణ పొందిన సూపర్​వైజర్​ను ఏర్పాటు చేసుకోవాలని కూడా వారికి సూచించినట్టు తెలిపారు. ప్రస్తుతం నాంపల్లి మెట్రోపాలిటన్​ మెజిస్ట్రేట్​ వద్ద 297 కేసులు విచారణలో ఉన్నట్టు ఫుడ్ కంట్రోలర్ తెలిపారు. ఆహార కల్తీ, గడువు తీరిన వస్తువులను వాడే వారిపై రూ. 3 లక్షల నుంచి 5లక్షల వరకు జరిమానా, జైలు శిక్ష కూడా విధించే చాన్స్ ఉందని అధికారులు తెలిపారు. 

త్వరలో వర్క్​షాప్​లు.. 

 గ్రేటర్ సిటీలో హోటళ్లలో నాణ్యత పాటించేందుకు నిర్వాహకులకు, సిబ్బందికి త్వరలో శిక్షణ ఇస్తామని అధికారులు చెప్తున్నారు.  వచ్చే నెల నుంచి ప్రతి నెలా 400 నుంచి 500 మందిని ఈ వర్క్​షాప్​లకు పిలువనున్నారు.  వంటల్లో ఎలాంటి వస్తువులు వాడవచ్చు, ఎలాంటివి వాడకూడదో వివరిస్తారు.  హోటళ్లు, రెస్టారెంట్​లు, వీధి వ్యాపారం చేసేవారు, ఫంక్షన్లలో వంటలు చేసేవారు, మెస్​లలో వంట మనుషులుగా పనిచేసే వారు తప్పనిసరిగా శిక్షణ కార్యక్రమాలకు హాజరు కావాలని, నిర్వాహకులకు  నోటీసులు పంపుతామని హెచ్చరించారు. హోటల్​కిచెన్​ నిర్వహణపై ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికెట్లు అందించనున్నట్టు.. ఇవి జాబ్ చేయడానికి అర్హతగా కూడా పనికి వస్తాయని అధికారులు తెలిపారు. 

ఫిర్యాదు ఇలా.. 

మీరెప్పుడైనా ఎంతో ఇష్టంగా మంచి హోటల్​తో ఫ్రెండ్స్​తోనే, ఫ్యామిలీతో భోజనం చేద్దామని వెళ్లినప్పుడు..  ఫుడ్​ అంత నాణ్యత లేకుండా కనిపించి, డిజప్పాయింట్​ అయ్యారా?  అలాంటి వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటే ఆలస్యం చేయకుండా జీహెచ్​ఎంసీ అధికారులకు సమాచారం అందించొచ్చు.  కిచెన్​ వాతావరణం ఆరోగ్యకరంగా ఉండేలా చూసేందుకు ఫుడ్​సేఫ్టీ, జీహెచ్​ఎంసీ సంయుక్తంగా చర్యలు తీసుకుంటోంది.  సిటీలో ఫుడ్​ కల్తీపైనే రోజుకు 40 ఫిర్యాదులు వస్తున్నట్టు కూడా అధికారులు తెలిపారు. ప్రజలు ఎవరైనా ఆహార కల్తీ పై ఫిర్యాదు చేయాలంటే జీహెచ్​ఎంసీ కంట్రోల్​ రూం నం 040–21111111 కు కాల్ చేయాలి. లేదా జీహెచ్ఎంసీ కమిషనర్, తెలంగాణ ఫుడ్​సేఫ్టీ కమిషనర్​కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.  

ఏ హోటల్​.. ఎంత డర్టీ?

బాహుబలి ఖానా లో  నిషేధిత సింథిటిక్ ఫుడ్​ కలర్స్​ 
రామేశ్వరం కేఫ్​లో గడువు తీరిన 100 కేజీల మినపపప్పు బస్తా, అపరిశుభ్రమైన పరిస్థితుల్లో పాలు, పెరుగు మాసాబ్​టాంక్​లోని లెబనీస్​ బైట్స్, చిచాస్​ హోటళ్లలో నిషేధిత ఫుడ్​కలర్స్.పేరు మోసిన స్టార్​హోటళ్లు, రెస్టారెంట్​లు, మధ్యస్థాయి రెస్టారెంట్లు సైతం ఆహార పదార్థాల వినియోగం, నిల్వలో నాణ్యత పాటించడం లేదని అధికారులు గుర్తించారు. వినియోగదారులను ఆకట్టుకునేలా ఎంతో ప్రచారం చేసుకుంటున్నా నాసిరకం వంటకాలను వడ్డిస్తున్నారు.సిటీలో 120 హోటళ్లలో తనిఖీలునిర్వహించగా 40 హోటళ్లకు అధికారుల నోటీసులు,15 హోటళ్ల పై కేసు నమోదు