కరెంట్ టాపిక్.. ద్రవ్య, ఆర్థిక బిల్లులు

కరెంట్ టాపిక్.. ద్రవ్య, ఆర్థిక బిల్లులు
  • ఒక ఆర్థిక బిల్లు ద్రవ్య బిల్లా కాదా అనే నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్​ అంతిమ నిర్ణయం కలిగి ఉంటాడు. ఈ నిర్ణయాన్ని న్యాయస్థానంలో కానీ పార్లమెంట్లో కానీ రాష్ట్రపతి కానీ ప్రశ్నించడానికి వీలులేదు. 
  • ఆర్టికల్​ 109 ప్రకారం ద్రవ్య బిల్లును ముందుగా  రాజ్యసభలో ప్రవేశపెట్టరాదు. 
  • ద్రవ్య బిల్లును కేవలం లోక్​సభలో మాత్రమే రాష్ట్రపతి ముందస్తు అనుమతితో ప్రవేశపెట్టాలి. 
  • ద్రవ్య బిల్లు కేవలం ప్రభుత్వ బిల్లుగా పరిగణించబడుతుంది. కాబట్టి దీనిని మంత్రి ద్వారా మాత్రమే ప్రవేశపెట్టాలి.     
  • రాజ్యసభకు ద్రవ్యబిల్లును తిరస్కరించే, సవరణ చేసే అధికారం ఉండదు. 14 రోజుల లోపు తన నిర్ణయాన్ని తెలపాలి. ఏవైనా కొన్ని సిఫారసులు సూచించవచ్చు. ఆ సిఫారసులకు లోక్​సభ పరిగణనలోనికి తీసుకున్నా తీసుకోకపోయినా బిల్లు ఆమోదించబడినట్లుగానే పరిగణించబడుతుంది.
  • బిల్లు తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపబడుతుంది. రాష్ట్రపతి బిల్లును ఆమోదించవచ్చు లేదా నిర్ణయం తెలుపకపోవచ్చు. కానీ పున: పరిశీలనకు పంపరాదు. తిరస్కరించరాదు. 
  • ఆర్టికల్​ 110లో ద్రవ్య బిల్లు నిర్వచనం ఇవ్వబడింది. దీని ప్రకారం కేవలం కింది అంశాలను కలిగి ఉన్న బిల్లును ద్రవ్య బిల్లుగా పరిగణించవచ్చు.     
  • ఒక పన్ను విధించడం, రద్దు చేయడం, తగ్గించడం, క్రమబద్దం చేయడానికి సంబంధించిన బిల్లు కేంద్ర ప్రభుత్వ రుణాలను క్రమబద్ధం చేసే బిల్లులు భారత సంఘటిత నిధి లేదా ఆగంతక నిధికి డబ్బులు జమ చేయడం లేక ఉపసంహరించడానికి సంబంధించిన బిల్లులు భారత సంఘటిత నిధికి సంబంధించి ఉప కల్పనా బిల్లులు భారత సంఘటిత నిధిపై ఛార్జి చేసే వ్యయానికి సంబంధించిన బిల్లులు భారత సంఘటిత నిధి లేక భారత ప్రభుత్వ ఖాతాకు సంబంధించిన రాబడులు కలిగిన బిల్లులు.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలను ఆడిటింగ్​ చేయడానికి సంబంధించిన బిల్లులు. పై అంశాలకు సంబంధించిన ఇతర బిల్లులు కూడా ద్రవ్య బిల్లులుగా పరిగణించబడతాయి.
  • కింది బిల్లుల విషయంలో ఆర్థిక ప్రతిపాదికన ఉన్నా ద్రవ్యబిల్లుగా పరిగణించాల్సిన అవసరం లేదు. 1. జరిమానాలు, ఇతర పెనాల్టీలు విధించడానికి సంబంధించిన బిల్లు.
  • 2. లైసెన్స్​, ఫీజు లేక ఏదైనా సేవలపై వసూలు చేసే ఫీజులకు సంబంధించిన బిల్లులు. 3. ఏదైనా స్థానిక సంస్థకు సంబంధించిన పన్ను విధించడానికి, ఉపసంహరించడానికి, తగ్గించడానికి లేదా క్రమబద్ధీకరించడానికి సంబంధించిన బిల్లులు ఆర్థికాంశాలతో కూడిన బిల్లును ఆర్థిక బిల్లు అంటారు. ఈ బిల్లులు మూడు రకాలు. అవి.. ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు–1, ఆర్థిక బిల్లు–2
  •  ద్రవ్య బిల్లు ఆర్థిక బిల్లులో అంతర్భాగమే. ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులే. కానీ ఆర్థిక బిల్లులన్నీ ద్రవ్య బిల్లులు కాదు. స్పీకర్​ ద్రవ్యబిల్లుగా ధ్రువీకరించిన ఆర్థిక బిల్లులు మాత్రమే ద్రవ్య బిల్లులు.     
  • ఆర్టికల్ 110లో పేర్కొన్న అంశాలతోపాటు ఇతర సాధారణ అంశాలు ఉంటాయి. రుణాలు సేకరించే అంశాలపై చట్టాలను చేసేటప్పుడు రుణానికి సంబంధించిన అంశాలతోపాటు ఇతర అంశాలు అందులో ఉంటాయి. 
  • ద్రవ్యబిల్లు, ఆర్థిక బిల్లును కేవలం లోక్​సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. వీటిని కేవలం రాష్ట్రపతి పూర్వ అనుమతితోనే ప్రవేశపెట్టాలి. 
  • మిగిలిన అన్ని విషయాల్లో ఆర్థిక బిల్లు–1 సాధారణ బిల్లులాగే పరిగణించబడుతుంది. ఆర్థిక బిల్లు–1ను రాజ్యసభ ఆమోదించవచ్చు. లేదా తిరస్కరించవచ్చు.  
  • రాజ్యసభ, లోక్​సభల మధ్య ప్రతిష్ఠం భన ఏర్పడినప్పుడు రాష్ట్రపతి సంయుక్త సమావేశానికి కూడా అవకాశం ఉంటుంది.  
  • బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపినప్పుడు దానిని ఆమోదించవచ్చు. నిలుపుదల చేయవచ్చు. పున:పరిశీలనకు పంపవచ్చు. 
  • ఆర్థిక బిల్లు–2లో కేంద్ర సంఘటిత నిధి నుంచి చేసే ఖర్చులకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఆర్టికల్ 110లో పేర్కొన్న అంశాలు ఉండవు.   
  • ఇది సాధారణ బిల్లుగానే పరిగణిస్తారు. కానీ ఈ బిల్లు ప్రత్యేకత ఏమిటంటే ఆర్థిక బిల్లు–2ను పరిశీలించమని రాష్ట్రపతి సిఫారసు చేస్తే తప్ప లోక్​సభ గానీ రాజ్యసభ గానీ ఈ బిల్లును ఆమోదించకూడదు. 
  • ఈ బిల్లును ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదు. కానీ బిల్లును ఆమోదించడానికి రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి.     
  • ఇరు సభల్లో బిల్లును ఏ సభ అయినా తిరస్కరించవచ్చు లేదా మార్పులు సూచించవచ్చు. రెండు సభల మధ్య ప్రతిష్ఠంభన ఏర్పడినప్పుడు ఉమ్మడి సమావేశానికి అవకాశం ఉంటుంది. 
  • రాష్ట్రపతి ఆమోదానికి పంపినప్పుడు బిల్లును ఆమోదించవచ్చు నిలుపుదల చేయవచ్చు లేదా పున: పరిశీలనకు పంపవచ్చు.