స్టార్టప్‌‌‌‌ల కోసం రూ. 9,500 కోట్లు

స్టార్టప్‌‌‌‌ల కోసం రూ. 9,500 కోట్లు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్త వెంచర్ల ప్రోత్సాహానికి ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్ (ఎఫ్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎస్) కోసం రూ.9,500 కోట్లు కేటాయించినట్లు సిడ్బీ చైర్మన్ ఎస్ రామన్ శుక్రవారం తెలిపారు.  స్టార్టప్​ ఇండియా యాక్షన్ ప్లాన్‌‌‌‌కు అనుగుణంగా జనవరి 16, 2016న ఎఫ్​ఎఫ్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎస్​ను ప్రధానమంత్రి ఆవిష్కరించారు. సెబీలో రిజిస్టర్ అయిన వివిధ ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల (ఏఐఎఫ్​లు)కి సహకారం కోసం ఇది రూ. 10 వేల కోట్ల కార్పస్‌‌‌‌ను ఆమోదించింది. 

ఇన్నోవేషన్- ఆధారిత ఎంటర్‌‌‌‌ప్రైజెస్ అభివృద్ధి  వృద్ధికి తోడ్పాటును అందించే లక్ష్యంతో ఏర్పాటైన ఎఫ్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎస్​, సెబీ-రిజిస్టర్డ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ఫండ్‌‌‌‌ల మూలధనంలో పాల్గొనడం ద్వారా స్టార్టప్‌‌‌‌లకు నిధుల అవసరాలను తీరుస్తుంది. ఎఫ్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎస్  వల్ల 100కు పైగా ఏఐఎఫ్‌‌‌‌లు రూ. 56,000 కోట్లు సమీకరించాయని రామన్ అన్నారు.