బెంగాల్ లోని కొన్ని గ్రామాలకు ఆగస్టు 18న స్వాతంత్ర్యం

బెంగాల్ లోని కొన్ని గ్రామాలకు ఆగస్టు 18న స్వాతంత్ర్యం

దేశానికి స్వాతంత్ర్యం ఆగస్టు 15న అని అందరికి తెలుసు కానీ. పశ్చిబెంగాల్ లోని పలు గ్రామాలు కొన్ని సంవత్సరాలుగా ఆగస్టు 18న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాయి. ఇంతకీ  ఎక్కడంటే.. పశ్చిమబెంగాల్ లోని నడియా, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కొన్ని  గ్రామాలు ఆగస్టు 18 స్వాతంత్ర్యం దినోత్సవం జరుపుకుంటాయి ఈ వేడుకలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. స్వాతంత్ర్య దినోత్సవ సమయంలో ఈ ప్రాంతాలు ఈస్ట్ పాకిస్తాన్(బంగ్లాదేశ్ ) లో కలిపేశారు. ఈ ప్రాంతాల్లో మెజారిటీ హిందువులే ఉన్నారు. వీరంతా తమను భారత్ లో కలపాలని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆగస్టు 17 ,1947 రాత్రి ఈ ప్రాంతాలు భారతదేశంలో కలిపినట్లు ప్రకటించబడ్డాయి. తొలిసారి ఆగస్టు 18న అక్కడ మన త్రివర్ణ జెండా ఎగురవేశారు. దీంతో అక్కడ మూడు రోజులు ఆలస్యంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 18 స్వాతంత్ర్యం జరుపుకుంటారు.