సౌదీ చరిత్రలో మొదటిసారి.. ఆర్మీలోకి మహిళలు

V6 Velugu Posted on Feb 24, 2021

సౌదీ మహిళలు ఒకప్పుడు దేశం వదిలి బయటకు వెళ్లాలంటే కచ్చితంగా మగతోడు కావాలి. లేదా వాళ్లు ‘నో అబ్జెక్షన్‌‌’ అంటూ పర్మిషన్‌‌ ఇవ్వాలి. కనీసం సొంతంగా కారు కూడా నడుపుకులేని  పరిస్థితి వారిది. అలాంటిది ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితులు మారుతున్నాయి. మహిళలపై ఉన్న ఆంక్షలను ఒక్కోటిగా తొలుగుతున్నాయి. కారు నడపొచ్చని, షాపింగ్‌‌మాల్స్‌‌, రెస్టారెంట్లలో పనిచేయొచ్చని పర్మిషన్‌‌ ఇచ్చిన ప్రభుత్వం సౌదీ మహిళలను  ఇప్పుడు  ఆర్మీలోకి తీసుకుంటోంది. ఆడవాళ్లు కూడా ఆర్మీలో చేరి దేశసేవ చేయొచ్చని చెప్పింది. సోల్జర్స్‌‌, ల్యాన్స్‌‌ కోర్‌‌‌‌పొరాల్స్‌‌, సెర్జియంట్స్‌‌, స్టాఫ్‌‌ సెర్జియంట్స్‌‌గా మహిళలను రిక్రూట్‌‌ చేసుకోనుంది అక్కడి ప్రభుత్వం. సౌదీని ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా క్రౌన్‌‌ ప్రిన్స్‌‌ మహ్మద్‌‌ బిన్‌‌ సల్మాన్‌‌ మహిళలకు ఎన్నో సడలింపులు ఇచ్చారు. ఒకప్పుడు కనీసం బయటికి కూడా స్వతంత్రం లేని సౌదీ మహిళలకు ఈ మధ్యకాలంలో  చాలా సడలింపులు ఇచ్చారు. కార్‌‌‌‌ డ్రైవ్‌‌ చేసేందుకు పర్మిషన్‌‌ ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత షాపింగ్‌‌ మాల్స్‌‌, హోటల్స్‌‌లో కూడా వర్క్‌‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. మగతోడు లేకుండా దేశం విడిచి వెళ్లేందుకు 2018లో పర్మిషన్‌‌  ఇచ్చిన ప్రభుత్వం మహిళలు ఆర్మీలో చేరేందుకు 2019లో నిర్ణయం తీసుకు న్నప్పటికీ దాన్ని ఇప్పుడు అమలు చేస్తోంది.

For More News..

సకల సౌకర్యాలతో మొతెరా అదుర్స్‌

స్టార్​ కంపెనీలుగా మారిన స్టార్టప్ కంపెనీలు

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీకి మస్తు నామినేషన్లు

Tagged womens, army, Saudi history, saudi women army

Latest Videos

Subscribe Now

More News