
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్టులో శనివారం మధ్యాహ్నం భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళుతున్న ఓ వ్యక్తి వద్ద రూ.67,11,250 విలువ చేసే అమెరికెన్డాలర్లు దొరికాయి. బ్యాగ్అడుగు భాగాన కరెన్సీ నోట్లను అమర్చి, పైకి ప్లాస్టిక్పేపర్కనిపించేలా చేసి అడ్డంగా దొరికిపోయాడు. విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.