కెనడాలో హృదయ విదారక ఘటన.. పాపం.. మన అమ్మాయికి ఏ కష్టం వచ్చిందో..!

కెనడాలో హృదయ విదారక ఘటన.. పాపం.. మన అమ్మాయికి ఏ కష్టం వచ్చిందో..!

న్యూఢిల్లీ: పెద్ద పెద్ద చదువుల కోసమంటూ విదేశాలకు వెళ్లే విద్యార్థులు పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. ఓవైపు చదువుకుంటూ, మరోవైపు చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకు వెళ్లదీస్తూ ఉంటారు. ఒకవేళ పనులు దొరక్కున్నా, ఆయా దేశాలు నిబంధనలు కఠినతరం చేసినా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. 

ఇలాంటి ఘటనలు తరచూ వింటూనే ఉన్నాం. ఇప్పుడు హృదయవిదారకరమైన వీడియో ఒకటి బయటకొచ్చింది. కెనడాలో ఓ ఫారిన్ స్టూడెంట్ భిక్షాటన చేస్తున్నట్టుగా అందులో ఉంది. రైల్వే స్టేషన్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ వద్ద ఆమె ఓ మూలన కూర్చొని భిక్షాటన చేస్తుండగా, ఎవరో వీడియో తీశారు. 

ఆ టైమ్‌‌‌‌లో యువతి ఇబ్బంది పడుతూ, తన ముఖం కనబడకుండా అట్టముక్క అడ్డుపెట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌‌‌గా మారింది. ఆ యువతి భారత్‌‌‌‌కు చెందిన స్టూడెంట్ కావొచ్చని పలువురు పేర్కొన్నారు.