కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ఓపెన్కాస్ట్ విస్తరణలో భాగంగా ఫేజ్2 మైన్ ఏర్పాటుకు అవసరమైన అటవీ భూమికి బదులుగా ఇవ్వాలని ప్రతిపాదించిన శ్రీరాంపూర్ ఓసీపీ డంప్యార్డు భూములను అటవీ, సింగరేణి ఉన్నతాధికారుల బృందం శుక్రవారం పరిశీలించింది.
మంచిర్యాల డీఎఫ్వో రాహుల్కిషన్జాదవ్, డివిజనల్ఆఫీసర్సర్వేశ్వర్, ఎఫ్ఆర్వో రత్నాకర్, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, ఎస్వోటుజీఎం జీఎల్ ప్రసాద్, డీజీఎం(సర్వే)దేశాయ్ తదితరులు భూములను పరిశీలించారు. విస్తీర్ణం, మట్టి గుణాలు, నీటి లభ్యత అంశాలపై చర్చించారు. ఆర్కేపీ ఓసీపీ మేనేజర్ పంకజ్, ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
