పాకాల సందర్శనకు వెళితే.. ఇష్టమొచ్చినట్లు కొట్టిండు

పాకాల సందర్శనకు వెళితే.. ఇష్టమొచ్చినట్లు కొట్టిండు

పాకాల సందర్శనకు వెళితే.. అకారణంగా తమను  బీట్ ఆఫీసర్ చితకబాదాడని వరంగల్ జిల్లాకు చెందిన యువకులు ఆరోపించారు. దుగ్గొండి మండలానికి చెందిన యువకులు పాకాలకు వెళ్లారు. అక్కడున్న వాచ్ టవర్ పైకి ఎక్కామన్నారు.కొందరు ఫొటోలు తీసుకుంటుండగా ఓ వ్యక్తి వచ్చి నీళ్ళ ట్యాంక్ ఎందుకు ధ్వంసం చేశారని  నిలదీశారని.. తాము ఏమి చేయలేదని చెప్పినా వినిపించుకోలేదన్నారు..

అనంతరం బీట్ ఆఫీసర్ ఉదయ్ దగ్గరకు తీసుకెళ్లాడని తెలిపారు. అక్కడకు వెళ్లడమే ఆలస్యం..కర్రతో తమను ఆ ఆఫీసర్ కొట్టాడని వెల్లడించారు. కానిస్టేబుల్ ఈవెంట్స్ ఉన్నాయని.. కొట్టవద్దని చెప్పినా వినిపించుకోలేదని వాపోయారు. బైక్స్ తీసుకోవడంతో ఇంటికి వెళ్లలేకపోయామని.. ఇక్కడే ఓ రూంలో తమను పెట్టారన్నాడు. బైక్ లు సీజ్ చేసి రాత్రి యువకులను కొత్తగూడ ఫారెస్ట్ ఆఫీస్ కి తరలించి తెల్లవారుజామున యువకులను వదిలిపెట్టారు. ఏ తప్పూ చేయని తమను బీట్ ఆఫీసర్ చితకబాదాడని బాధితులు వాపోయారు.