టింబర్ మర్చంట్ల సమస్యల పరిష్కారానికి కృషి

టింబర్ మర్చంట్ల సమస్యల పరిష్కారానికి కృషి
  • ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్​ ఫారెస్ట్​ సువర్ణ

బషీర్​బాగ్, వెలుగు: టింబర్ మర్చంట్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్​ఆఫ్​ఫారెస్ట్​పి.సువర్ణ హామీ ఇచ్చారు. లక్డీకాపుల్ లో ఆదివారం నిర్వహించిన ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ టింబర్ మర్చంట్స్, సామిల్స్ అనుబంధ పరిశ్రమల సంఘం ఫోర్త్​జనరల్ బాడీ మీటింగ్ కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

టింబర్ డిపోలు, సామిల్స్ లో అటవీ అధికారులు తమ విధుల్లో భాగంగా తనిఖీలు చేస్తున్నారని, ఎలాంటి వేధింపులు ఉండవని పేర్కొన్నారు. అనంతరం సంఘం అధ్యక్షుడిగా సీహెచ్.రామణయ్య, ప్రధాన కార్యదర్శిగా రంగారెడ్డి ని ఎన్నుకున్నారు.