రీల్స్ కోసం వాటర్ ఫాల్ వద్దకు వెళ్లి..! అడవిలో చిక్కుకుపోయిన యువకుడు

రీల్స్ కోసం వాటర్ ఫాల్ వద్దకు వెళ్లి..!  అడవిలో చిక్కుకుపోయిన యువకుడు
  • సాయం కోరగాఫారెస్ట్ సిబ్బంది రెస్క్యూ  

వెంకటాపురం వెలుగు: రీల్స్ చేసేందుకు వాటర్ ఫాల్ వద్దకు వెళ్లిన యువకుడు అడవిలో చిక్కుకోగా ఫారెస్ట్ సిబ్బంది రెస్క్యూ చేసిన ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటాపురం ఫారెస్ట్ ఆఫీసర్ వంశీకృష్ణ తెలిపిన ప్రకారం..  వీరభద్రవరం సమీపంలోని ముత్యం ధార జలపాతం వద్దకు వరంగల్ కు చెందిన అబ్రహార్ హుస్సేన్  రీల్స్ చేసేందుకు సోమవారం సాయంత్రం బేస్ క్యాంప్ సిబ్బంది కళ్లు గప్పి వెళ్లాడు. తిరిగొస్తుండగా కాలికి గాయమైంది. దీంతో  రాత్రి 9:45 సమయంలో అతడు డయల్ 100కు ఫోన్ చేసి సాయం కోరాడు.  

ఫారెస్ట్, బేస్ క్యాంప్ సిబ్బందికి సమాచారం అందించగా వెళ్లారు.  అడవిలో అర్ధరాత్రి 2:00 గంటల వరకు గాలింపు చేసి హుస్సేన్ ని రెస్క్యూ చేశారు. పర్యాటకులకు వాజేడు మండలం బొగత జలపాతం వద్దకు మాత్రమే పర్మిషన్ ఉందని, కాగా.. ముత్యం ధార, కొంగాల, మహితాపురం వంటి జలపాతాల వద్దకు లేదని ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. దట్టమైన అడవి ప్రాంతాలు కావడంతో వన్యప్రాణుల బారినపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.