తప్పిపోయిన చిరుత పిల్ల.. తల్లితో కలిపేందుకు గాలింపు

తప్పిపోయిన చిరుత పిల్ల.. తల్లితో కలిపేందుకు గాలింపు

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ సమీపంలో ఉన్న ఓ అడవిలో చిరుత పిల్ల తప్పిపోయింది. అడవిలో కూంబింగ్ చేస్తుండగా ఆ చిరుత కూన ఫారెస్ట్ సిబ్బందికి దొరికింది. ఆ పిల్లను ఇప్పుడు అటవీ సిబ్బంది సంరక్షిస్తున్నారు. దానిని చిన్నపిల్లలకు పట్టినట్లు డబ్బాపాలు పడుతూ ఆకలి తీరుస్తున్నారు. అయితే ఈ చిరుత పిల్లను, దాని తల్లిని కలిపేందుకు ఫారెస్ట్ సిబ్బంది గాలింపు చేపడుతున్నారు. ఈ విషయాన్ని డీఎఫ్‌వో రాజేశ్ కుమార్ వెల్లడించారు.

చిరుత పులి పిల్లను, దాని తల్లిని కలిపేందుకు అడవిలో తమ సిబ్బంది కూబింగ్ చేస్తున్నారని, చిరుత జాడ తెలిస్తే రెండింటినీ ఒకటి చేస్తామని డీఎఫ్వో రాజేశ్ కుమార్ చెప్పారు. ప్రస్తుతం చిరుత పిల్ల తమ సంరక్షణలో ఉందన్నారు.

మరిన్ని వార్తల కోసం..

కూకట్‌పల్లిలో గోడ కూలి నాలుగేళ్ల చిన్నారి మృతి

కానిస్టేబుళ్లపై కత్తితో దాడి చేసిన యువకుడు

పాడైన వ్యర్థాలతో అద్భుతాలు సృష్టిస్తున్న యువ ఇంజినీర్