అడవుల్లో ప్లాస్టిక్ వేయొద్దు : సీహెచ్.సువర్ణ

అడవుల్లో ప్లాస్టిక్ వేయొద్దు  : సీహెచ్.సువర్ణ

ములుగు, వెలుగు: అడవుల్లో ప్లాస్టిక్, అటవీ జంతువులకు ఆహారం వేయొద్దని ప్రిన్సిపల్ చీఫ్​ కన్జర్వేటర్​ ఆఫ్​ ఫారెస్ట్ సీహెచ్.సువర్ణ సూచించారు. శనివారం ములుగులో డీఎఫ్వో రాహుల్​ కిషన్​ జాదవ్​తో కలిసి పలు సూచనలతో కూడిన స్టిక్కర్లు, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడారం జాతర సందర్భంగా మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులు వన్యప్రాణులకు ఎలాంటి హాని కలిగించొద్దన్నారు. 

భక్తులకు అవగాహన కల్పించేవిధంగా ములుగు, పస్రా, తాడ్వాయి రేంజ్​ పరిధిలో జాతీయ రహదారికి ఇరువైపులో సైన్​ బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భూపాలపల్లి సీసీఎఫ్​ బి.ప్రభాకర్, ఎఫ్డీవో కె.సత్తయ్య, రేంజర్​ డోలి శంకర్ తదితరులు పాల్గొన్నారు.