జనగాం బస్టాండ్ లో గుడ్డెలుగు హడల్

జనగాం బస్టాండ్ లో గుడ్డెలుగు హడల్

జనగామ జిల్లా : పొద్దుపొద్దున్నే జనగామ బస్టాండ్ దగ్గర ఓ గుడ్డెలుగు జనాన్ని హడలెత్తించింది. బస్టాండ్ దగ్గర రోడ్డుపై అటూ ఇటూ తిరిగి…. పక్కనే ఉన్న ఓ చెట్టు ఎక్కి కూర్చుంది. జనం దాన్ని చూసి పరుగులు పెట్టారు. జనం పోగుకావడంతో.. ట్రాఫిక్ కు కూడా ఇబ్బంది కలిగింది.

స్థానికుల సమాచారంతో పోలీసులు, అటవీ అధికారులు అక్కడకు వచ్చారు. గుడ్డెలుగును పట్టుకునేందుకు ట్రై చేశారు. మూడుసార్లు మత్తుమందు ఉన్న ఇంజెక్షన్లతో దానిపై షూట్ చేశారు. ఐనా అది చిక్కలేదు. మత్తులోకి జారి కిందపడుతుందన్న ఉద్దేశంతో చెట్టుకింద వలతో సిద్ధంగా ఉన్నారు. కానీ అది దిగలేదు. అక్కడినుంచి దూకి ప్రహారీగోడ మీదుగా పక్కనే ఉన్న బస్ డిపో లోకి దూకింది.

చాలా సేపు శ్రమించి.. మొత్తానికి ఎలుగుబంటిని పట్టుకున్నారు ఫారెస్ట్ సిబ్బంది.