తెలంగాణలో పది రెట్లు పెరిగిన అబార్షన్లు... ఒక్క ఏడాదిలోనే..

తెలంగాణలో పది రెట్లు పెరిగిన అబార్షన్లు... ఒక్క ఏడాదిలోనే..

ఇటీవల కాలంలో హైదరాబాద్ లాంటి సిటీల్లో సహజీవనం, కో లివింగ్ కల్చర్ పెరిగిపోతోంది. ఇందుకు కారణం యువతలో మారుతున్న ఆలోచనా ధోరణి, ఆర్థిక స్వేచ్ఛ, వెస్ట్రన్ కల్చర్ ప్రభావం.. ఇలా చాలా అంశాలని చెప్పచ్చు. శరవేగంగా పెరుగుతున్న ఈ కల్చర్ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇదిలా ఉండగా... పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సాక్షిగా వెల్లడైన గణాంకాలు తెలంగాణ ప్రజలకు ఆందోళన కలిగించేలా ఉన్నాయి.. గత ఐదేళ్ళలో తెలంగాణ రాష్ట్రంలో అబార్షన్లు పది రెట్లు పెరిగాయంట.. 

2020-21 నుంచి 2024-25 వరకు తెలంగాణలో అబార్షన్ల రేటు ఏకంగా పది రెట్లు పెరగడం ఆందోళన కలిగించే విషయమని చెప్పాలి. 2021 ఆర్థిక సంవత్సరంలో వెయ్యి 578 అబార్షన్లు జరగగా.. 2024-25లో ఆ సంఖ్య 16 వేల 59 చేరినట్లు తెలుస్తోంది. ఇది పది రేట్ల కంటే ఎక్కువనే చెప్పాలి. ఏపీలో ఈ సంఖ్య 2 వేల 282 నుంచి నాలుగు రెట్లు పెరిగి 10 వేల 676కు చేరింది. ఈ లిస్ట్ లో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. తమిళనాడు,అస్సాం, కర్ణాటక, రాజస్థాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 20 అబార్షన్లతో లక్షద్వీప్ చివరి స్థానంలో ఉంది.

దేశవ్యాప్తంగా మెట్రో సిటీల్లో సహజీవన సంస్కృతి పెరగడమే ఇందుకు కారణమని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. చాలా మంది దంపతులు సంతానం వద్దని అనుకోవడమే ఇందుకు ముఖ్య కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా సిటీల్లో సెటిలైన జంటల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలో జనాభా వృద్ధి రేటు గణనీయంగా పడిపోయింది. పిల్లలు వద్దని అనుకున్నవారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా కూడా అబార్షన్లు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. పౌష్టికాహార లోపం కూడా పెరుగుతున్న అబార్షన్లకు కారణమని తెలుస్తోంది.