పోడు భూముల గొడవలో ఫారెస్ట్ ఆఫీస‌ర్‌ మృతి

పోడు భూముల గొడవలో ఫారెస్ట్ ఆఫీస‌ర్‌ మృతి

భద్రాద్రి జిల్లా చండ్రుగొండలో పోడు భూముల గొడవలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ చనిపోయారు. నిన్న ఎర్రబోడు సమీపంలోని పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు నాటిన మొక్కల్ని తొలగించేందుకు గొత్తికోయలు యత్నం చేశారు . దీంతో ఫారెస్ట్ అధికారులు, గొత్తికోయలకు మధ్య వాగ్వాదం,  తొపులాట జరిగింది. ఈ ఘటనలో రేంజర్ శ్రీనివాస్ పై వేటకొడవళ్లతో దాడి చేయడంతో  ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఇవాళ చికిత్సపొందుతూ శ్రీనివాస్ చనిపోయాడు. 

గుత్తికోయల దాడిలో రేంజర్‌ శ్రీనివాసరావు మరణించడం పట్ల అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే అధికారులపై ఇలా దాడులు చేయడం సరికాదన్నారు. అటవీ అధికారులు మనోస్థైర్యం కోల్పోవద్దన్న మంత్రి .. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.