విజయవాడలో రెచ్చిపోయిన ప్రేమ జంట.. నడిరోడ్డుపై వెళుతూ బైక్పై ముద్దులాట

విజయవాడలో రెచ్చిపోయిన ప్రేమ జంట.. నడిరోడ్డుపై వెళుతూ బైక్పై ముద్దులాట

విజయవాడ: ఆంధ్రాలోని బెజవాడలో.. అదేనండీ విజయవాడలో ప్రేమ జంట రెచ్చిపోయింది. రోడ్డు మీద బైక్పై వెళుతూ మద్యం మత్తులో రన్నింగ్ బైక్పై సదరు జంట రొమాన్స్ చేసుకుంది. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. వీళ్ల బైక్ పక్కన వాహనాలు వెళుతూనే ఉన్నాయి. వీళ్ల పక్క నుంచే వెళుతున్న వాహనదారులు వీళ్లను గమనిస్తూనే ఉన్నారు. అయినా సరే.. ఎవ్వరినీ ఈ ప్రేమ జంట పట్టించుకోలేదు. పైగా.. తామేదో పెద్ద ఘన కార్యం చేస్తున్నట్టుగా స్టంట్స్ చేస్తూ బైక్ను అష్టవంకరలు తిప్పుతూ ముద్దు పెట్టుకున్నారు.

వీళ్లు ఇలాంటి వేషాలు వేసింది ఏ అర్థరాత్రో.. అపరాత్రో అయితే తెలిసేది కాదేమో గానీ రాత్రి సమయంలో జనాలు రోడ్లపై తిరుగుతుండగానే ఇంత ఓవరాక్షన్ చేశారు. విజయవాడ NH-16 హైవేపై రామలింగేశ్వర నగర్ ఫ్లై ఓవర్ మీద బైక్‌పై రొమాన్స్ చేస్తున్న ఈ ప్రేమ జంట పైత్యాన్ని వీళ్ల వెనుక వస్తున్న వాహనదారుడు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశాడు. ఇంకేముంది.. విజయవాడలో ఈ ప్రేమ జంట నిర్వాకం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.

ALSO READ | మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఫ్రీ బస్ స్కీమ్‎పై CM చంద్రబాబు కీలక ప్రకటన