
ఐపీఎల్ 2025లో ఆదివారం (మే 18) అభిమానులను అలరించడానికి రెండు మ్యాచ్ లు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భాగంగా మధ్యాహ్నం పంజాబ్ కింగ్స్ తో రాజస్థా రాయల్స్ తలబడుతుంది. జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి వైదొలిగిన రాజస్థాన్ బెంచ్ ను పరీక్షించాలని చూస్తోంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. కెప్టెన్ సంజు శాంసన్ జట్టులోకి తిరిగి వచ్చాడు. ఆర్చర్ స్థానంలో సౌతాఫ్రికా పేసర్ మఫాకా ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించాడు.
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, వనిందు హసరంగా, క్వేనా మఫాకా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ మధ్వల్, ఫజల్‌హాక్ ఫరూఖ్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మిచెల్ ఓవెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్