
Zen Technologies: ఆపరేషన్ సిందూర్ విజయవంతం తర్వాత దేశీయ ఈక్విటీ మార్కెట్లలో డిఫెన్స్ స్టాక్స్‌కి డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. గడచిన కొన్ని రోజుల్లోనే ఈ రంగంలోని అనేక కంపెనీల షేర్లు భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. పైగా డిఫెన్స్ ఆర్డర్లు సైతం భారత సంస్థలకు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతోంది జెన్ టెక్నాలజీస్ కంపెనీ షేర్ల గురించే. వాస్తవానికి ఈ కంపెనీ డ్రోన్ల తయారీ రంగంలో వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. కంపెనీ తన మార్చి త్రైమాసిక ఫలితాలను తాజాగా ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపధికన 190 శాతం పెరిగి రూ.101.04 కోట్లుగా నమోదైంది. అలాగే ఆదాయాలు ఏకండా గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే డబుల్ అయ్యి రూ.325 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ మెుత్తం వ్యయం రూ.195.70 కోట్లుగా నమోదయ్యాయి.
ALSO READ | Monday Markets: గతవారం రూ.26 లక్షల కోట్లు లాభం.. మరి కొత్తవారం పరిస్థితి ఏంటి..?
ఇదే క్రమంలో కంపెనీ తన పెట్టుబడిదారులకు 200 శాతం డివిడెండ్ ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లు ఒక్కో షేరుపై ఏకంగా రూ.2 డివిడెండ్ ఆఫర్ చేసింది. ఫిబ్రవరి 14, 2025న వెక్టర్ టెక్నిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి జెన్ టెక్నాలజీస్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించిన సంగతి తెలిసిందే. డీల్ పూర్తి చేసేందుకు కంపెనీ రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. చివరిగా శుక్రవారం నాడు కంపెనీ షేర్లు బీఎస్ఈలో అప్పర్ సర్క్యూట్ తాకి ఒక్కోటి రూ.వెయ్యి 794 వద్ద ట్రేడింగ్ ముగించింది. గడచిన ఏడాది కాలంలో కంపెనీ తన ఇన్వెస్టర్లకు 90 శాతం రాబడిని అందించింది.