7 బిలియన్ డాలర్లు తగ్గిన ఫారెక్స్ నిల్వలు

7 బిలియన్ డాలర్లు తగ్గిన ఫారెక్స్ నిల్వలు

న్యూఢిల్లీ: ఇండియా ఫారెక్స్‌‌‌‌‌‌‌‌ నిల్వలు వరుసగా రెండో వారంలోనూ తగ్గాయి. ఈ నెల 13తో ముగిసిన వారంలో 7.052 బిలియన్ డాలర్లు తగ్గి 709.759 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లకు చేరాయని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ప్రకటించింది.  అంతకుముందు వారంలో  11.683 బిలియన్ డాలర్లు తగ్గి 716.81 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 13న నిల్వలు 725.727 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్ల దగ్గర ఆల్‌‌‌‌‌‌‌‌ టైమ్ హైని నమోదు చేశాయి.

మార్చి 13తో ముగిసిన వారంలో ఫారిన్ కరెన్సీ ఆస్తులు 7.678 బిలియన్  డాలర్లు తగ్గి 555.568 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లకు చేరాయి. బంగారంనిల్వలు 664 మిలియన్ డాలర్లు పెరిగి 130.681 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లకు పెరిగాయి.  ఎస్‌‌‌‌‌‌‌‌డీఆర్స్‌‌‌‌‌‌‌‌ మాత్రం 23 మిలియన్ డాలర్లు తగ్గి 18.697 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లకు  చేరగా, ఐఎంఎఫ్‌‌‌‌‌‌‌‌ వద్ద  రిజర్వ్ పొజిషన్ 4.814 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లుగా నమోదైంది.